ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 2:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

స్వ‌ర్ణ‌కారుల శంఖారావాన్ని జ‌య‌ప్ర‌దం చేయాలి, అధ్యక్ష కార్యదర్శిలు పిలుపు.

స్వ‌ర్ణ‌కారుల శంఖారావాన్ని జ‌య‌ప్ర‌దం చేయాలి, అధ్యక్ష కార్యదర్శిలు పిలుపు.

సికింద్రాబాద్: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 23.

ఈ నెల హైదరాబాద్ లో జరుగనున్న స్వర్ణకారుల శంఖారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వకర్మసంఘం అధ్యక్ష కార్యదర్శులు గోపాలపురం ప్రకాష్, గిర్మపురం భాస్కరాచారి పిలుపునిచ్చారు.   సికింద్రాబాద్ లోని విశ్వకర్మ సంఘం భవనంలో జరిగిన సమావేశంలో శంకారావం సభకు సంబంధించిన గోడ పత్రికను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణ కారుల సమస్యల పరిష్కారం, వృత్తి పరిరక్షణ, సంక్షేమం ద్యేయంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50ఏళ్లు నిండిన ప్రతి స్వర్ణకారునికి రూ 5వేల పెన్షన్ ఇవ్వాలని, జీఓ 272ని సవరించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం సరూర్ నగర్ గ్రౌండ్స్ లో సభను జరుపనున్నట్లు పేర్కొన్నారు. స్వర్ణకారులంతా తమతమ దుఖానాలను మూసివేసి స్వచ్ఛందంగా పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని కోరారు.